ఏపీలో నలుగురు పోలీసు అధికారులపై వేటు....
ఓటరు జాబితా సవరణలో జోక్యం చేసుకున్నారన్న ఆరోపణలతో బాపట్లలో నలుగురు పోలీసు అధికారులపై వేటు పడింది.
బాపట్ల : ఆంధ్రప్రదేశ్ లోని బాపట్లలో నలుగురు పోలీసు అధికారులపై వేటుపడింది. ఈ నలుగురు పోలీసులు ఓటరు జాబితా సవరణలో జోక్యం చేసుకున్నారని వీరి మీద ఆరోపణలు ఉన్నాయి. మార్టూరు సిఐ, యుద్దనపూడి, పర్చూరు, మార్టూరు ఎస్సైలను వేకెన్సీ రిజర్వ్ (వీఆర్)కు పంపించారు. మీరు ఎన్నికల అధికారుల నుంచి ఫామ్ సెవెన్ కు సంబంధించిన సమాచారం తీసుకున్నారని, ఈ కారణంతో వారిపై చర్యలకు ఉపక్రమించినట్లుగా సమాచారం. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.