ఉమ్మడి  కృష్ణా జిల్లాలోని  పెడనలో  మహిళపై ఇవాళ యాసిడ్ దాడి  జరిగింది.  బాధితురాలిని ఆసుపత్రిలో  చేర్పించారు.  

విజయవాడ: ఉమ్మడి కృష్ణా జిల్లాలో మంగళవారంనాడు మహిళ యాసిడ్ దాడి జరిగింది. పెడన రామలక్ష్మి కాలనీలో దుండగులు యాసిడ్ దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో మహిళ కరుణ కుమారి తీవ్రంగా గాయపడింది. ఆమెను స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

కరుణకుమారిపై యాసిడ్ దాడికి పాల్పడింది రాముడుగా పోలీసులు గుర్తించారు. రాముడి వద్ద కరుణ కుమారి రూ. 20 వేలు అప్పుగా తీసుకుంది. భర్తకు తెలియకుండా ఆమె ఈ అప్పు తీసుకుందని సమాచారం. ఈ డబ్బులు ఆమె తిరిగి ఇవ్వలేదు. ఈ డబ్బుల విషయమై రాముడు బాధితురాలిని వేధిస్తున్నాడు. డబ్బులు ఇవ్వలేదనే అక్కసుతో కరుణకుమారిపై రాముడు యాసిడ్ దాడికి దిగాడు. 

 బాధితురాలు ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలిని మచిలీపట్టణం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మచిలీపట్టణం ప్రభుత్వాసుపత్రిలో బాధితురాలు చికిత్స పొందుతుంది. కరుణకుమారిపై యాసిడ్ దాడి చేసిన రాముడిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.