క్వారంటైన్ కేంద్రం నుంచి ఓ నిందితుడు తప్పించుకు పారిపోయాడు. అతను ఓ మర్డర్ కేసులో నిందితుడు కావడం గమనార్హం. ఈ సంఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు క్వారంటైన్ కేంద్రం నుంచి ఓ మర్డర్ కేసులో నిందితుడు తప్పించుకుని పారిపోయాడు. మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో, ఓ నూడుల్స్ బండి యజమానిని మర్డర్ చేసిన కేసులో నిందితుడు. ప్రస్తుతం అతడు గన్నవరం సబ్ జైల్‌లో రిమాండ్‌లో ఉన్నాడు.


ఇటీవల కరోనా పాజిటివ్ రావటంతో, కంకిపాడు మండలంలోని ఈడుపుగల్లు క్వారంటెన్ కేంద్రానికి అధికారులు నిన్న సాయంత్రం తరలించారు. రాత్రి 10 గంటల సమయంలో తప్పించుకు పారిపోయినట్లు అధికారులు గుర్తించారు. నిందితుడి స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లా చింతల పూడి సమీపంలోని లింగంపల్లి. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవటంతో కేర్ అండ్ షేర్ స్వచ్చంధ సంస్థలో పెరిగినట్లు సమాచారం. కంకిపాడు పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.