పోలీసుల చెర నుంచి ఓ గంజాయి స్మగ్లర్ తప్పించుకున్నాడు. విశాఖ జిల్లా పెడగంట్యాడ న్యూ పోర్టు పోలీస్ స్టేషన్ నుంచే నిందితుడు పరార్ కావడం గమనార్హం. పోలీసుల కళ్లుగప్పి నిందితుడు నాగేశ్వరరావు పరారైనట్లు తెలుస్తోంది.

కాగా.. నిందితుడు నాగేశ్వరరావుని ఇటీవల 483 కేజీల గంజాయి తరలిస్తున్న కేసులో అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు. ఆదివారం తెల్లవారుజామున నిందితుడు స్టేషన్ నుంచి పారిపోగా.. పోలీసులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచినట్లు సమాచారం.

కాగా.. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా.. ఈ ఘటన విశాఖ నగరంలో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.