Asianet News TeluguAsianet News Telugu

నా భర్తను పోలీసులే చంపారు... సీఎం గారు న్యాయం చేయండి..: విజయవాడలో బాధిత మహిళ ఆందోళన

అక్రమంగా మద్యం తరలిస్తున్నాడంటూ అరెస్ట్ చేసి తన భర్తను పోలీసులే చంపారని విజయవాడ భవానినగర్ కు చెందిన ఓ మహిళ ఆరోపిస్తోంది. సీఎం గారు... మీరే న్యాయం చేయాలని మృతుని భార్య కోరింది.  

accused died in police custody in vijayawada
Author
Vijayawada, First Published Dec 8, 2021, 4:33 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

విజయవాడ: తెలంగాణ నుండి ఏపీకి అక్రమంగా మద్యం తరలిస్తూ అరెస్టయి... జైల్లో తీవ్ర అస్వస్థతకు గురయిన ఓ వ్యక్తి హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతిచెందాడు. అయితే తన భర్త మృతికి పోలీసులే కారణమని మృతుడి భార్య ఆరోపిస్తోంది. పోలీస్ కస్టడీలో వున్న వ్యక్తి మృతి కృష్ణా జిల్లా (krishna district) లో సంచలనంగా మారింది. 

వివరాల్లోకి వెళితే... విజయవాడ (vijayawada) భవానిపురంలో నివాసముండే భానుచందర్ (40) అక్రమంగా మద్యం (illegal liquar supply) తరలిస్తూ పోలీసులకు పట్టుబట్టాడు. తెలంగాణ (telangana)లో మద్యం ధరలు తక్కువగా వుండటంతో కొందరు అక్రమంగా ఏపీ (andhra pradesh)కి తరలించి అమ్ముకుంటూ క్యాష్ చేసుకుంటున్నారు. ఇలాగా భానుచందర్ కూడా గత ఆదివారం తెలంగాణ నుండి ఏపికి మద్యం తరలిస్తుండగా ఏ కొండూరు పోలీసులు పట్టుకున్నారు. అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చి రిమాండ్ కు తరలించారు. 

Video

కోర్టు ఆదేశాలతొ భానుచందర్ ను పోలీసులు సోమవారం సాయంత్రం నూజివీడ్ సబ్ జైలుకు తరలించారు. అయితే ఏమయ్యిందో తెలీదు గానీ భానుచందర్ తీవ్ర అస్వస్థతకు గురవడంతో జైలు సిబ్బంది వెంటనే నూజివీడు (nuziveedu) ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మరింత మెరుగైన వైద్యం అవసరమని అక్కడ డాక్టర్లు చెప్పడంతో విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ భానుచందర్ మృతిచెందాడు. 

read more  ‘నా చావుకు ఎవరూ కారణం కాదు..’ లేఖ రాసి సైబర్ ల్యాబ్ ఎస్ఐ ఆత్మహత్య....

ఈ విషయాన్ని పోలీసులు కుటుంబసభ్యులకు తెలియజేశారు. అనారోగ్యంతో అతడు చనిపోయినట్లు పోలీసులు చెబుతుంటే పోలీసులే తన భర్తను చంపివుంటారని మృతుని భార్య భత్తుల కళ్యాణి ఆరోపిస్తున్నారు. పోలీసులు తన భర్తను ఏదో చేసి చంపి ఉంటారని ఆరోపిస్తూ కళ్యాణి బిడ్డలతోో కలిసి హాస్పిటల్ వద్ద భోరున విలపిస్తోంది. సీఎం జగన్ గారు... మీరే తమకు న్యాయం జరిగేలా చూడాలంటూ బాధితురాలు కళ్యాణి కోరింది. 

పోలీస్ కస్టడీలో వున్న భానుచందర్ మృతిపై నూజివీడు డిఎస్పీ  శ్రీనివాసులు స్పందించారు. అతనికి షుగర్ వ్యాధి ఉందని... అనారోగ్యంతోనే చనిపోయాడని డిఎస్పీ స్పష్టం చేసారు. నూజివీడు నుంచి విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడని డిఎస్పీ శ్రీనివాసులు తెలిపారు.

ఇదిలావుంటే తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీస్‌ స్టేషన్‌లో మరియమ్మ (mariyamma) అనే మహిళ లాకప్ డెత్ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన సంగతి తెలిసిందే. మరియమ్మ లాకప్ డెత్‌ సంచలనంగా మారడంతో పోలీసులు పోలీస్ అధికారులు సస్పెండ్ అయ్యారు. అంతేకాదు ఈ కేసు విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. మేజిస్ట్రేట్ రిపోర్ట్ ఆధారంగా దర్యాప్తు చేయాలని సూచించింది.  

read more  UP Lockup Death.. ఐదుగురు పోలీసుల సస్పెన్షన్..

ఖమ్మం జిల్లా (khammam district) చింతకాని (chintakani) సమీపంలోని కోమట్లగూడెం గ్రామానికి చెందిన మరియమ్మ ఆమె కొడుకు ఉదయ్ యాదాద్రి భువనగిరి జిల్లాలోని చర్చిలో పనిచేసేవారు. అయితే చర్చిలో పనిచేసే సమయంలో  డబ్బులు పోయాయని చర్చి ఫాదర్  ఫిర్యాదు మేరకు  ఈ ఏడాది జూన్ 18వ తేదీన  ఉదయం 7:45 గంటలకు మరియమ్మతో పాటు ఆమె కొడుకు ఉదయ్, అతని స్నేహితుడు శంకర్ లను అడ్డగూడూరు పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి విచారించారు.

అయితే పోలీసులు కొట్టిన దెబ్బలకు తన తల్లి మరియమ్మ తన చేతుల్లోనే చనిపోయిందని ఉదయ్ ఆవేదన వ్యక్తం చేశారు. అప్పట్లో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో డీజీపికి ఈ విషయాన్ని ఉదయ్ తెలిపారు. మరియమ్మ పోలీసు కస్టడీలో ఉన్న సమయంలో మృతి చెందడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసింది. ఈ కేసులో ఇప్పటికే ఎస్సైతో పాటు ఇద్దరు కానిస్టేబుల్స్‌పై వేటుపడింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios