విజయవాడ దుర్గగుడి ఈవో సురేష్ బాబు అవకతవకలు: ఏసీబీ నివేదికలో కీలక అంశాలు

విజయవాడ దుర్గగుడి ఈవో సురేష్ బాబు తీవ్ర ఆర్ధిక అవకతవకలకు పాల్పడినట్టుగా  ఏసీబీ గుర్తించింది. ఈ మేరకు ఇటీవల నిర్వహించిన సోదాల్లో లభించిన ఆధారాలతో సహా రాష్ట్ర ప్రభుత్వానికి ఏసీబీ నివేదిక అందించింది.

ACB submits primary report to AP government on Vijayawada EO sureshbabu


విజయవాడ: విజయవాడ దుర్గగుడి ఈవో సురేష్ బాబు తీవ్ర ఆర్ధిక అవకతవకలకు పాల్పడినట్టుగా  ఏసీబీ గుర్తించింది. ఈ మేరకు ఇటీవల నిర్వహించిన సోదాల్లో లభించిన ఆధారాలతో సహా రాష్ట్ర ప్రభుత్వానికి ఏసీబీ నివేదిక అందించింది.ఇప్పటికే  దుర్గగుడిలో సుమారు 20 మందికిపైగా ఉద్యోగులను దేవాదాయశాఖ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. గత వారం రోజులుగా విజిలెన్స్ అదికారులు సోదాలు నిర్వహించారు. 

గతంలో నిర్వహించిన సోదాల ఆధారంగా  ఏసీబీ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాథమిక నివేదికను అందించింది.  త్వరలోనే పూర్తి స్థాయి నివేదికను ఏసీబీ రాష్ట్ర ప్రభుత్వానికి అందించే అవకాశం ఉంది.దేవాదాయశాఖ కమిషనర్ తో పాటు ఆడిట్ అభ్యంతరాలను కూడ తోసిపుచ్చినట్టుగా ఏసీబీ ఈ నివేదికలో తేల్చి చెప్పింది.

ప్రీ ఆడిట్ అభ్యంతరాలను కూడ లెక్కచేయకుండా ఈవో సురేష్ బాబు  డబ్బులను కాంట్రాక్టర్లకు చెల్లించినట్టుగా ఏసీబీ తెలిపింది.నిబంధనలకు విరుద్దంగా కేఎల్ టెక్నాలజీస్ కు శానిటరీ టెండర్లను కేటాయించారని ఏసీబీ గుర్తించింది. సెక్యూరిటీస్ సంస్థ టెండర్లలో మ్యాక్స్ సంస్థకు కట్టబెట్టారనే విషయమై కూడ తన నివేదికలో ఏసీబీ ప్రస్తావించింది.

టెండర్లు రద్దు చేయకుండా ఏ1 కాంట్రాక్టర్ తో చర్చలు జరపకుండా టెండర్లు ఖరారు చేయడాన్ని ఏసీబీ తప్పుబట్టింది.ఈ విషయమై దేవాదాయశాఖకు చెందిన ఉద్యోగులను కూడ ఏసీబీ విచారించే అవకాశం ఉంది. మరో నెల రోజుల తర్వాత ఈ విషయమై తుది నివేదికను ఏసీబీ  రాష్ట్ర ప్రభుత్వానికి అందించే అవకాశం ఉంది.

దుర్గగుడి ఈవో సురేష్ బాబు వ్యవహరశైలిపై ఇప్పటికే తీవ్రమైన ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో ఏసీబీ ప్రాథమికి నివేదికలో ఆర్ధిక అవతవకలకు పాల్పడిన విషయాన్ని ఏసీబీ గుర్తించింది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios