ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో వున్న రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు బుధవారం ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. 

ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి ఏసీబీ సోదాలు కలకలం రేపాయి. రాష్ట్రంలోని పలు రిజిస్ట్రార్ ఆఫీసుల్లో బుధవారం ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. విశాఖ, బద్వేల్, తుని, మేడికొండూరు, తిరుపతి , అనంతపురం, నర్సాపురం, జలమూరు సహా పలు ప్రాంతల్లో వున్న రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఏసీబీ దాడులు చేసింది. ఏసీబీ 14400 నెంబర్‌కు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈ సోదాలు నిర్వహించినట్లుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా కీలకమైన ఫైళ్లను పరిశీలిస్తున్నారు ఏసీబీ అధికారులు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred