ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసు: చంద్రబాబు రిమాండ్ అక్టోబర్ 5 వరకు పొడిగింపు
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ చీఫ్ చంద్రబాబు రిమాండ్ ను అక్టోబర్ 5వ తేదీ వరకు పొడిగిస్తూ ఏసీబీ కోర్టు ఆదివారంనాడు ఆదేశాలు జారీ చేసింది.
అమరావతి:టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు రిమాండ్ ను అక్టోబర్ 5వ తేదీ వరకు పొడిగిస్తూ ఏసీబీ కోర్టు ఆదివారంనాడు ఆదేశాలు జారీ చేసింది.టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడును ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు రిమాండ్ ఇవాళ్టితో ముగిసింది. దీంతో చంద్రబాబు రిమాండ్ ను ఈ ఏడాది అక్టోబర్ 5వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టుగా ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఆదివారంనాడు తెలిపారు.
ఆదివారంనాడు సాయంత్రం సీఐడీ కస్టడీ పూర్తి కాగానే ఏసీబీ కోర్టు జడ్జి ముందు చంద్రబాబును వర్చువల్ గా హాజరుపర్చారు జైలు అధికారులు. చంద్రబాబు కస్టడీకి ఇవ్వాలని సీఐడీ తరపు న్యాయవాదులు కోరారు. సీఐడీ న్యాయవాదులు కస్టడీ కోరుతూ మెమో దాఖలు చేయడంపై చంద్రబాబు తరపు న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. ఇవాళ్టితో రిమాండ్ ముగియడంతో చంద్రబాబు రిమాండ్ ను మరో 11 రోజుల పాటు పొడిగిస్తున్నట్టుగా ఏసీబీ కోర్టు తెలిపింది.
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబును ఈ నెల 9న ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు.ఈ కేసులో ఈ నెల 22వ తేదీ వరకు చంద్రబాబు రిమాండ్ పూర్తైంది. అయితే ఈ నెల 22న చంద్రబాబు రిమాండ్ ను ఈ నెల 24వ తేదీ వరకు బాబు రిమాండ్ ను పొడిగించింది ఏసీబీ కోర్టు. ఇవాళ సీఐడీ విచారణ పూర్తైన తర్వాత చంద్రబాబును వర్చువల్ గా ఏసీబీ కోర్టు విచారించింది. చంద్రబాబు రిమాండ్ ను మరో 11 రోజులు పొడిగించింది. చంద్రబాబు తరపు న్యాయవాదులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై ఏసీబీ కోర్టు రేపు విచారణ నిర్వహించనుంది.
also read:రాజమండ్రి సెంట్రల్ జైల్లో బాబు: హైకోర్టు న్యాయవాది లక్ష్మీనారాయణ భేటీ
ఇదిలా ఉంటే చంద్రబాబును మరో మూడు రోజుల పాటు కస్టడీలోకి తీసుకోవాలని సీఐడీ భావిస్తుంది. రెండు రోజుల విచారణకు సమయం సరిపోలేదని సీఐడీ భావిస్తుంది. చంద్రబాబు నుండి మరింత సమాచారం తీసుకోనేందుకు కస్టడీలోకి తీసుకోవాలని సీఐడీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.ఈ మేరకు ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేశారు.