Asianet News TeluguAsianet News Telugu

రాజమండ్రి సెంట్రల్ జైల్లో బాబు: హైకోర్టు న్యాయవాది లక్ష్మీనారాయణ భేటీ

చంద్రబాబుతో హైకోర్టు న్యాయవాది లక్ష్మీనారాయణ  శుక్రవారం నాడు భేటీ అయ్యారు.  ఏపీ హైకోర్టు, ఏసీబీ కోర్టుల్లో తీర్పులు వెలువడిన తర్వాత లక్ష్మీనారాయణ  రాజమండ్రి జైలులో బాబుతో సమావేశమయ్యారు.

AP High Court Advocate Laxminaraya Meets  Chandrababunaidu inRajahmundray Central jail lns
Author
First Published Sep 22, 2023, 5:08 PM IST

రాజమండ్రి:టీడీపీ చీఫ్ చంద్రబాబుతో హైకోర్టు న్యాయవాది లక్ష్మీనారాయణ  శుక్రవారం నాడు భేటీ అయ్యారు. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన  క్వాష్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. మరో వైపు రెండు రోజుల పాటు సీఐడీ కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతిని ఇచ్చింది.

రేపు, ఎల్లుండి చంద్రబాబును సీఐడీ అధికారులు విచారించనున్నారు. ఈ తరుణంలో చంద్రబాబుతో హైకోర్టు న్యాయవాది లక్ష్మీనారాయణ భేటీ అయ్యారు. ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ కొట్టివేత,చంద్రబాబును సీఐడీ కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చిన విషయాలను  బాబుకు న్యాయవాదులు వివరించే అవకాశం ఉంది. మరో వైపు ఈ పరిణామాలను చర్చించి  భవిష్యత్తులో ఏం చేయాలనే దానిపై చంద్రబాబుతో చర్చించే అవకాశం ఉందని సమాచారం. సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. 

ఈ నెల 9వ తేదీన ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో  ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ  కేసుతో పాటు ఇతర కేసుల్లో చంద్రబాబుపై పీటీ వారంట్లను అధికారులు దాఖలు చేశారు.  ఫైబర్ గ్రిడ్ కేసు, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుల్లో  పీటీ వారంట్లు దాఖలు చేశారు.  ఈ పీటీ వారంట్లపై  కోర్టులను అనుమతి కోరారు సీఐడీ అధికారులు. అయితే  ఒకే సారి అన్ని పిటిషన్లను విచారణను నిర్వహించలేమని  ఇటీవలనే ఏసీబీ కోర్టు  న్యాయమూర్తి ప్రకటించిన విషయం తెలిసిందే.

also read:క్వాష్ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు: లాయర్లతో లోకేష్ మంతనాలు, సుప్రీంను ఆశ్రయించనున్న బాబు

గత వారంలో కూడ  చంద్రబాబుతో  ఏపీ హైకోర్టు న్యాయమూర్తి లక్ష్మీనారాయణ టీడీపీ చీప్ చంద్రబాబుతో భేటీ అయ్యారు.  ఏపీ సీఐడీ దాఖలు చేసిన కేసుల విషయమై  చంద్రబాబుతో చర్చించారు. లక్ష్మీనారాయణ భేటీ అయిన రోజుల తర్వాత సుప్రీంకోర్టు న్యాయవాది  సిద్దార్ధ్ లూథ్రా కూడ బాబుతో సమావేశమైన విషయం తెలిసిందే.  అయితే  గత వారంలో కోర్టుల్లో దాఖలైన పిటిషన్లపై తీర్పులు వెలువడ్డాయి. రానున్న రోజుల్లో  ఏ కేసులో ఏ రకమైన వ్యూహంతో ముందుకు వెళ్లాలనే దానిపై చంద్రబాబుతో  లక్ష్మీనారాయణ చర్చించే అవకాశం ఉంది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios