Asianet News TeluguAsianet News Telugu

సంగం డెయిరీ కేసు: కస్టడికి ధూళిపాళ్ల నరేంద్ర, ఏసీబీకి న్యాయస్థానం అనుమతి

టీడీపీ సీనియర్ నేత, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతించింది. 4 రోజుల పాటు ఏసీబీ కస్టడీకి అనుమతిస్తూ ఏసీబీ కోర్టు ఆదేశించింది. న్యాయవాది సమక్షంలో ధూళిపాళ్లను ఏసీబీ అధికారులు విచారించనున్నారు

acb court allows dhulipalla narendra kumar custody ksp
Author
Amaravathi, First Published Apr 30, 2021, 8:33 PM IST

టీడీపీ సీనియర్ నేత, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతించింది. 4 రోజుల పాటు ఏసీబీ కస్టడీకి అనుమతిస్తూ ఏసీబీ కోర్టు ఆదేశించింది. న్యాయవాది సమక్షంలో ధూళిపాళ్లను ఏసీబీ అధికారులు విచారించనున్నారు.

ధూళిపాళ్ల నరేంద్ర కస్టడీ పిటిషన్‌పై శుక్రవారం ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. ధూళిపాళ్ల తరపున న్యాయవాది గొట్టిపాటి రామకృష్ణప్రసాద్‌ వాదనలు వినిపించారు. ప్రస్తుతం సంగం డెయిరీ ప్రభుత్వ ఆధీనంలో ఉందని, ధూళిపాళ్లను విచారించాల్సిన అవసరం ఏముందని రామకృష్ణ ప్రసాద్‌ ప్రశ్నించారు.

అయితే భూమి బదిలీ కూడా రికార్డుల్లో ఉందని.. ధూళిపాళ్ల వ్యక్తిగతంగా ఏమీ ప్రయోజనం పొందలేదని న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ధూళిపాళ్లను తమకు కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ తరపు న్యాయవాదులు న్యాయస్థానాన్ని కోరారు.

సంగం డెయిరీ కేసులో మరిన్ని అంశాలను విచారించాల్సి ఉందని ఏసీబీ లాయర్లు  తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం నరేంద్ర బెయిల్‌ పిటిషన్లపై విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

అంతకుముందు తనపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారంటూ టిడిపి మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర హైకోర్టుకు ఆశ్రయించగా తాజాగా అక్కడ కూడా ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. నరేంద్ర దాఖలుచేసిన క్వాష్ పిటిషన్ ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది. ధూళిపాళ్లపై నమోదయిన కేసులపై విచారణ కొనసాగించాలని ఏసీబీని ఆదేశించింది హైకోర్టు.  మే 5వ తేదీలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఏసిబిని ఆదేశించింది న్యాయస్థానం.   

Also Read:హైకోర్టులో ధూళిపాళ్లకు ఎదురుదెబ్బ... ఏసిబికి కీలక ఆదేశాలు

పాడి రైతులకు సంబంధించిన సంగం డెయిరీలో అవినీతికి పాల్పడ్డాడంటూ దూళిపాళ్లను ఏసిబి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను గత శుక్రవారం ఉదయమే ఏసిబి అధికారులు అరెస్ట్ చేశారు. అదుపులోకి తీసుకున్న తర్వాత విజయవాడ ఈఎస్ఐ హాస్పిటల్ లో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కోర్టులో హాజరుపర్చారు.

ఏసిబి న్యాయస్థానం ఆయనకు 14రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ధూళిపాళ్ళను విజయవాడ జిల్లా జైలుకు  తరలించారు. ధూళిపాళ్ల నరేంద్ర సంగం డెయిరీ చైర్మన్ గా పనిచేశారు. ఈ డెయిరీలో అవకతవకలు జరిగినట్లు ఆరోపిస్తూ ఛైర్మన్ పై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన ఏసీబీ అధికారులు ఆయనను అరెస్టు చేశారు.

నరేంద్రపై 408, 409, 418, 420, 465, 471, 120బీ, రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సీఆర్పీసీ సెక్షన్ 50(2) కింద నరేంద్ర సతీమణికి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. నరేంద్రపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసినట్లు ఏసీబీ తన నోటీసులో చెప్పింది. 

Follow Us:
Download App:
  • android
  • ios