Asianet News TeluguAsianet News Telugu

హైకోర్టులో ధూళిపాళ్లకు ఎదురుదెబ్బ... ఏసిబికి కీలక ఆదేశాలు

 టిడిపి మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తన అరెస్ట్ పై హైకోర్టుకు ఆశ్రయించగా అక్కడ ఆయనకు ఎదురుదెబ్బ తప్పలేదు. 

AP High Couurt Dismissed dhulipalla narendra  quash petition akp
Author
Guntur, First Published Apr 29, 2021, 1:04 PM IST

గుంటూరు:  తనపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారంటూ టిడిపి మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర హైకోర్టుకు ఆశ్రయించగా తాజాగా అక్కడ కూడా ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. నరేంద్ర దాఖలుచేసిన క్వాష్ పిటిషన్ ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది. ధూళిపాళ్లపై నమోదయిన కేసులపై విచారణ కొనసాగించాలని ఏసీబీని ఆదేశించింది హైకోర్టు.  మే 5వ తేదీలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఏసిబిని ఆదేశించింది న్యాయస్థానం.   

పాడి రైతులకు సంబంధించిన సంగం డెయిరీలో అవినీతికి పాల్పడ్డాడంటూ దూళిపాళ్లను ఏసిబి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను గత శుక్రవారం ఉదయమే ఏసిబి అధికారులు అరెస్ట్ చేశారు. అదుపులోకి తీసుకున్న తర్వాత విజయవాడ ఈఎస్ఐ హాస్పిటల్ లో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కోర్టులో హాజరుపర్చారు. ఏసిబి న్యాయస్థానం ఆయనకు 14రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ధూళిపాళ్ళను విజయవాడ జిల్లా జైలుకు  తరలించారు.

ధూళిపాళ్ల నరేంద్ర సంగం డెయిరీ చైర్మన్ గా పనిచేశారు. ఈ డెయిరీలో అవకతవకలు జరిగినట్లు ఆరోపిస్తూ ఛైర్మన్ పై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన ఏసీబీ అధికారులు ఆయనను అరెస్టు చేశారు. నరేంద్రపై 408, 409, 418, 420, 465, 471, 120బీ, రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సీఆర్పీసీ సెక్షన్ 50(2) కింద నరేంద్ర సతీమణికి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. నరేంద్రపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసినట్లు ఏసీబీ తన నోటీసులో చెప్పింది. 

read more నరేంద్రకు ఏపీ సర్కార్ షాక్: సంగం డెయిరీ నిర్వహణ ఇక ప్రభుత్వం గుప్పిట్లోకి

 నరేంద్రను అరెస్టు చేయడం దుర్మార్గమైన విషయమని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. చట్టం తన పని తాను చేస్తుందని ఆయన అన్నారు. కేసు ఏమిటో తెలియదని, విషయం చెప్పకుండా అరెస్టు చేశారని, ఇది దారుణమని ఆయన అన్నారు. తప్పు చేస్తే నోటీసు ఇవ్వాలని ఆయన అన్నారు. నేరం ఏమిటో తెలియదని ఆయన అన్నారు. కోర్టులో ఉన్న విషయం మీద ఎలా అరెస్టు చేస్తారని ఆయన ప్రశ్నించారు. అరెస్టు చేయకపోతే ప్రపంచం బద్దలైపోతుందా అని ఆడిగారు. కరోనా విలయతాండవం చేస్తుంటే, వందల మంది పోలీసులు ఇంట్లోకి వెళ్లి అరెస్టు చేయడం ఈ సమయంలో అవసరమా అని అడిగారు. 

కక్ష సాధింపు చర్యలో భాగంగానే అరెస్టు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద విమర్శలు చేస్తున్నందు వల్లనే అరెస్టు చేశారని ఆయన అన్నారు. వైఎస్ జగన్ మీద ఎవరు విమర్శలు చేస్తే వారిని అరెస్టు చేస్తున్నారని ఆయన అన్నారు. దొంగలం, బందిపోట్లం కాదని, నోటీసులు ఇస్తే సమాధానం చెప్తామని ఆయన అన్నారు. ఈ సంఘటనపై ఏం చేయాలనే విషయంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని అచ్చెన్నాయుడు చెప్పారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios