Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబుపై ఆస్తుల కేసు డిసెంబర్ 6కు వాయిదా: కారణమిదే

చంద్రబాబు ఆస్తుల కేసును డిసెంబర్ 6వ తేదీకి వాయిదా వేస్తూ ఏసీబీ ప్రత్యేక కోర్టు వాయిదా వేసింది. 

ACB court adjourns Naidu assets case to December 6
Author
Amaravati, First Published Nov 26, 2019, 12:46 PM IST

హైదరాబాద్: టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడుపై ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణలతో గతంలో దాఖలైన కేసు విచారణ ఈ ఏడాది డిసెంబర్ 6వ తేదీకి వాయిదా పడింది. ఈ కేసు విచారణలో సీనియర్ న్యాయవాది విచారణకు హాజరుకానున్నారని కేసును వాయిదా వేయాలని  లక్ష్మీపార్వతి తరపు న్యాయవాది కోరిన మీదట కేసును డిసెంబర్ 6వ తేదీకి వాయిదా వేసింది ఏసీబీ ప్రత్యేక కోర్టు.

Alsor Read:ఏసీబీ కోర్టు షాక్: చంద్రబాబు ఆస్తులపై విచారణ

టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడనే నెపంతో  లక్ష్మీపార్వతి 2005 లో ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసు విషయమై  స్టే తెచ్చుకొన్నాడు.. చంద్రబాబునాయుడు. అయితే స్టేను ఎత్తివేస్తూ ఏసీబీ ప్రత్యేక కోర్టు  నిర్ణయం తీసుకొంది. దీంతో కేసు విచారణను చేపట్టాలని ఏసీబీ కోర్టు నిర్ణయం తీసుకొంది.

also read:అక్రమాస్తులపై ఏసీబీ కేసు: చంద్రబాబు స్పందన ఇదీ

వాస్తవానికి ఈ కేసు విచారణను ఈ నెల  25వ తేదీన చేయాల్సి ఉంది. అయితే ఈకేసును వాదించేందుకుగాను సీనియర్ న్యాయవాది హాజరుకానున్నందున కేసును వాయిదా వేయాలని ఏసీబీ ప్రత్యేక కోర్టును లక్ష్మీపార్వతి తరపు న్యాయవాది అభ్యర్ధించారు. ఈ అభ్యర్థనను ఏసీబీ ప్రత్యేక కోర్టు  అంగీకరించింది. దీంతో ఈ కేసు విచారణను డిసెంబర్ 6వ తేదీకి వాయిదా వేసింది ఏసబీ ప్రత్యేక కోర్టు.

ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఏపీ మాజీ సీఎం చంద్రబాబుపై .14 ఏళ్ల క్రితం ఏసీబీ కోర్టులో లక్ష్మీపార్వతి దాఖలు చేసిన ఫిర్యాదుపై తదుపరి విచారణ చేపట్టేందుకు ఏసీబీ కోర్టు ఈ నెల 18వ తేదీన అంగీకారం తెలిపింది.

ఈ కేసులో చంద్రబాబు స్టే గడువు ముగిసింది. స్టే విషయంలో హైకోర్టు నుంచి ఎలాంటి పొడిగింపు లేకపోవడంతో కేసులో తదుపరి ప్రక్రియను ప్రారంభి స్తామని ఏసీబీ ప్రత్యేక కోర్టు జడ్జి సాంబశివరావు నాయుడు ఈ నెల 18వ తేదీన లిఖితపూర్వక ఉత్తర్వులు జారీ చేశారు.

 ఫిర్యాదుదారుగా ఉన్నలక్ష్మీపార్వతి సాక్ష్యాన్ని నమోదు చేయాలని నిర్ణయించి తదుపరి విచారణను ఈ నెల 25కి కోర్టు వాయిదా వేసిన విషయం తెలిసిందే.అయితే సీనియర్ న్యాయవాది కోసం విచారణను వాయిదా వేయాలని లక్ష్మీపార్వతి తరపున పిటిషనర్ కోర్టును కోరడంతో కోర్టు అంగీకారం తెలిపింది.

సివిల్, క్రిమినల్‌ కేసుల్లో స్టే ఆరు నెలలకు మించకూడదని సుప్రీంకోర్టు గత ఏడాది ఇచ్చిన తీర్పును, చంద్రబాబు స్టే గడువు ముగిసిన విషయాన్ని, ఆ స్టేకు ఎలాంటి పొడిగింపు లేకపోవడాన్ని జడ్జి తన ఉత్తర్వుల్లో పొందుపరిచారు.

2005 మార్చి 14న అప్పట్లో ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను జడ్జి పరిశీలించారు. కేసు విచారణకు స్వీకరించడానికి ముందు దశలో చంద్రబాబు తరఫు న్యాయవాది వాదనలు వినిపించేందుకు వీలులేదన్న ఆ ఉత్తర్వుల్ని జడ్జి పరిగణనలోకి తీసుకున్నారు. 

2005లో హైకోర్టు ఇచ్చిన స్టేను పొడిగించని విషయాన్ని ఈ విషయాన్ని చంద్రబాబు తరఫు న్యాయవాది నిర్ధారించిన విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో చంద్రబాబు 2005లో తెచ్చుకున్న స్టేను పొడిగిస్తూ హైకోర్టు ఎలాంటి లిఖితపూర్వక ఉత్తర్వులు ఇవ్వలేదని జడ్జి గుర్తు చేశారు. అందువల్ల ఈ కేసులో తదుపరి ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు.

ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని దీనిపై ఏసీబీ విచారణకు ఆదేశించాలని కోరుతూ లక్ష్మీపార్వతి 2005లో ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశారు. ఈ ఫిర్యాదుపై పూర్తిస్థాయి విచారణ ప్రారంభించక ముందే చంద్రబాబు ఇంప్లీడ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

ఫిర్యాదును స్వీకరించడానికి ముందే వాదనలు వినడం సాధ్యం కాదంటూ చంద్రబాబు అభ్యర్థనను ఏసీబీ కోర్టు తోసిపుచ్చింది. దీనిపై ఆయన హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై విచారణ జరిపిన అప్పటి న్యాయమూర్తి డీఎస్‌ఆర్‌ వర్మ ఏసీబీ కోర్టులో విచారణకు సంబంధించిన తదుపరి చర్యలు నిలిపేస్తూ 2005లోనే స్టే ఉత్తర్వులిచ్చారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios