ఏలూరు:అక్రమ ఆస్తుల వ్యవహారంలో స్టే రద్దుపై పూర్తి సమాచారం లేదని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు  చెప్పారు.మంగళవారం నాడు టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు పశ్చిమ గోదావరి  జిల్లా తణుకులో  పార్టీ నేతలతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తనపై గతంలో 26 అక్రమ కేసులు పెట్టారని చంద్రబాబునాయుడు గుర్తు చేశారు. అంతేకాదు ఈ కేసుల్లో తనను ఏమీ చేయలేకపోయారని చెప్పారు. ఈ కేసు విషయాన్ని న్యాయవాదులు చూసుకొంటారని చంద్రబాబునాయుడు తెలిపారు.  

సెక్యూరిటీ సాకుతో తనను కార్యకర్తలను కలుసుకోకుండా పోలీసులు అడ్డుకొంటున్నారని చంద్రబాబునాయుడు ఆరోపించారు. తణుకులో ఆశా వర్కర్లకు సంఘీభావం చెప్పేందుకు వెళ్లిన ఎమ్మెల్యే రామానాయుడుపై కేసులు పెట్టారని చంద్రబాబునాయుడు గుర్తు చేశారు.

Also read:ఏసీబీ కోర్టు షాక్: చంద్రబాబు ఆస్తులపై విచారణ

పశ్చిమ గోదావరి జిల్లాలోని తమ పార్టీ కార్యకర్తలపై వైసీపీ వేధింపులు ఎక్కువైనట్టుగా చంద్రబాబునాయుడు చెప్పారు.  పశ్చిమగోదావరి జిల్లాలో ఏనాడూ కూడ ఈ పరిస్థితిని తాను చూడలేదన్నారు.

 తణుకులో తాను పర్యటించనున్నట్టుగా 10 రోజుల ముందే పోలీసులకు సమాచారం ఇచ్చినట్టుగా ఆయన గుర్తు చేశారు. 30 సీ యాక్ట్ అమల్లోకి తీసుకురావడంపై  చంద్రబాబునాయుడు మండిపడ్డారు.