అమరావతి:పొన్నూరు మాజీ ఎమ్మెల్యే  ధూళిపాళ్ల నరేంద్ర బెయిల్ పిటిషన్ పై శుక్రవారం నాడు తీర్పు వెల్లడిస్తామని ఏసీబీ కోర్టు తెలిపింది. ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ బెయిల్ పిటిషన్ పై ఏసీబీ కోర్టులో గురువారం నాడు విచారణ నిర్వహించింది. ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ బెయిల్ పిటిషన్ పై విచారణకు సిద్దమన్న ఆయన తరపు న్యాయవాదులు తెలిపారు. అయితే  తమకు  వారం రోజులు సమయం కావాలని ఏసీబీ ఏపిపి కోరారు.  అయితే ఈ వాదనను  ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తిరస్కరించారు. 

also read:ధూళిపాళ్ల నరేంద్రకు కరోనా పాజిటివ్: ప్రైవేట్ ఆస్పత్రికి తరలింపు

ముద్దాయిలు ఆసుపత్రిలో ఉన్న కారణంగా కస్టోడియల్ ఇంటరాగేషన్ పూర్తి చేయలేక పోయినట్టుగా ఏసీబీ తరపు న్యాయవాది తెలిపారు. ఈ కారణంగా  బెయిలు ఇవ్వరాదని న్యాయమూర్తి ని  ఏపిపి కోరారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రేపటి వరకు అనగా 7 మే 2021 వరకు ఇచ్చిన కస్టడీ గడువు పొడిగించబోనని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తేల్చి చెప్పారు.

హైకోర్టు ఉత్తర్వుల మేరకు బెయిల్ పిటిషన్లను డిస్పోస్ చేయవలసి ఉన్నందున ఎట్టి పరిస్థితులలో ఆర్గ్యుమెంట్ చెప్పవలసినదేనని ఏసీబీ ఏపీపీకి న్యాయమూర్తి తేల్చిచెప్పారు.ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ఏసీబీ  వాదనలను వినిపిస్తానన్న ఏపీపీ హైకోర్టుకు తెలిపారు.వాదనలు విన్న తర్వాత  ఈ నెల 7న బెయిల్ పిటిషన్ పై  తీర్పు చెప్తానని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తెలిపారు.