కర్నూల్:  నంద్యాలలోని అబ్దుల్ సలాం  అత్త, ఇతర బంధువులు శుక్రవారం నాడు ఏపీ సీఎం వైఎస్ జగన్ ను కలిశారు.

నంద్యాల సీఐ సోమేశేఖర్ రెడ్డి వేధింపులతో ఆత్మహత్య చేసుకొంటామని సెల్పీ వీడియో రికార్డు చేసి అబ్దుల్ సలాం కుటుంబం ఈ నెల 3వ తేదీన ఆత్మహత్య చేసుకొన్న విషయం తెలిసిందే.

ఈ ఘటనపై  ఏపీ రాష్ట్రంలో రాజకీయంగా సంచలనంగా మారింది. అధికార పార్టీపై టీడీపీ విమర్శలు గుప్పించింది.ఇవాళ కర్నూల్ జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం జగన్ ను  అబ్దుల్ సలాం బంధువులు కలిశారు.

also read:అప్పటివరకు రూ. 25 లక్షలు తీసుకోను, తెల్లకాగితాలపై సంతకాలు పెట్టాలని ఒత్తిడి: అబ్దుల్ సలాం అత్త

సలాం అత్త మాబున్నీసా బేగం, ఆమె కూతురు సాజీదా, కొడుకు శంషావళిలు ఇవాళ సీఎంను కలిశారు. సలాం మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని సీఎంను వారు కోరారు.

also read:సీఎంను అరెస్టు చేస్తారా: సలాం ఘటనపై సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు

ఈ ఘటనకు సంబంధించి జగన్ కు వివరించారు. పోలీసులు  ఏ రకంగా ఇబ్బందులు పెట్టారో వారంతా వివరించారు.నిందితులను కఠినంగా శిక్షిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు.  మరోవైపు  తన కూతురు సాజీదాకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని మాబున్నీసా బేగం జగన్ ను కోరారు. ఈ విషయమై ఆయన సానుకూలంగా స్పందించారు.