తాడేపల్లిలోని ఏపీ సీఎం జగన్ నివాసం ఎదుట ఆరోగ్య మిత్రలు ఆందోళన చేపట్టారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ వారు ఈ ఆందోళన చేపట్టారు. 11 ఏళ్లుగా పని చేస్తున్నప్పటికీ తమను కాదని.. ప్రభుత్వం కొత్తగా నియమిస్తున్న వాలంటీర్లకు తమ విధులు అప్పగిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 

ఈ ఆందోళనలో 13 జిల్లాల నుంచి పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. జీతం లేకపోయినా కేవలం కమీషన్‌ ప్రాతిపదికన పని చేస్తున్నామని వారు వాపోయారు. గ్రామ వాలంటీర్లను తీసుకుంటే తమను తొలగిస్తారనే ప్రచారం జరుగుతోందని, దీనిపై ముఖ్యమంత్రి స్పందించి న్యాయం చేయాలని కోరారు.ఆందోళన చేపడుతున్న మహిళలతో పోలీసులు వాగ్వాదానికి దిగారు. పోలీసుల తీరుపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.