బుట్టలో వేసుకో.. పడకపోతే బురద చల్లు, ఇదే ఆ ఛానెల్స్ తీరు : పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆగ్రహం
కొన్ని ఛానెల్స్‌లో కోర్టు వాదనలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. బుట్టలో వేసుకో.. పడకపోతే బురద చల్లు ఇదే విధానాలతో ఏబీఎన్, టీవీ5 ఛానెళ్లు నడుస్తున్నాయని పొన్నవోలు ధ్వజమెత్తారు.
కొన్ని ఛానెల్స్‌లో కోర్టు వాదనలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏబీఎన్, టీవీ5లు కోర్టులో జరుగుతున్న వాదనలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఫైర్ అయ్యారు. ఇది దుర్మార్గమని పొన్నవోలు సుధాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఏబీఎన్, టీవీ5లు దిగజారి ప్రవర్తిస్తున్నాయని.. ఈ రెండు ఛానెల్స్ పచ్చి అబద్ధాలను ప్రసారం చేస్తున్నాయని ఆయన ఎద్దేవా చేశారు. కోర్టు నా వాదనలకు అడ్డుపడినట్లుగా ప్రసారం చేశారని.. కోర్టు తనను తిట్టినట్లుగా ప్రచారం చేస్తున్నారని పొన్నవోలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
బుట్టలో వేసుకో.. పడకపోతే బురద చల్లు ఇదే విధానాలతో ఏబీఎన్, టీవీ5 ఛానెళ్లు నడుస్తున్నాయని పొన్నవోలు ధ్వజమెత్తారు. ప్రభుత్వం తరపున తాను తన బాధ్యతలు నిర్వర్తిస్తున్నానని.. తనపై ఇష్టమొచ్చినట్లు దుష్ప్రచారం చేస్తున్నారని పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏబీఎన్, టీవీ5 ఛానెళ్లు ఇంత దిగజారుతాయా అని పొన్నవోలు ఫైర్ అయ్యారు.
ఇలాంటి ప్రచారాలకు తాను భయపడే ప్రసక్తే లేదని.. ఈ కేసుతో ప్రస్తుత ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. 2018లోనే జీఎస్టీ డీజీ స్కిల్ కేసులో విచారణ చేపట్టారని పొన్నవోలు పేర్కొన్నారు. స్కిల్ స్కాంలో ఏ37, ఏ 38 ప్రమేయం వుందని పొన్నవోలు తెలిపారు. పూర్తి ఆధారాలను న్యాయస్థానం ముందుంచామని.. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను కూడా న్యాయస్థానం ముందుంచామని సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు.
ALso Read: చంద్రబాబు బెయిల్ , కస్టడీ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా.. కోర్టులో వాడివేడి వాదనలు
అంతకుముందు స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో చంద్రబాబు నాయుడు బెయిల్, కస్టడీ పిటిషన్‌లపై విచారణ సందర్భంగా సీఐడీ తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. చంద్రబాబుకు ఎందుకు బెయిల్ ఇవ్వకూడదనే అంశంపై వాదించారు. రిమాండ్‌లో వుండి కూడా చంద్రబాబు సాక్ష్యులను ప్రభావితం చేస్తున్నారని పొన్నవోలు పేర్కొన్నారు. జైల్లో వుండగానే చంద్రబాబు ప్రభావితం చేస్తున్నారని.. ఇక బయటకు వస్తే ఇంకెంత ప్రభావం చేస్తారోనని పొన్నవోలు వాదించారు.
అయితే స్కిల్ స్కాంలో చంద్రబాబుకు డబ్బు ముట్టిందన్న దానిపై ఆధారాలు వున్నాయా అని న్యాయమూర్తి ప్రశ్నించారు. పెండ్యాల శ్రీనివాస్, వాసుదేవ్ పార్థసానిలు విదేశాలకు పరారయ్యారని పొన్నవోలు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. చంద్రబాబుతో ఆర్ధిక లావాదేవీలు జరిపారు కాబట్టే వారు విదేశాలకు వెళ్లిపోయారని ఆయన పేర్కొన్నారు. 164 కింద వాంగ్మూలం ఇచ్చిన పీవీ రమేష్ మాట మార్చారని.. మీడియాలో మరో విధంగా చెబుతున్నారని పొన్నవోలు వాదించారు.