అక్రమ సంబంధానికి ముగ్గురు బలి : ప్రియుడి చేతిలో వివాహిత, ఆమె కొడుకు హతం

a young boy killed married woman and his son at guntur
Highlights

అనంతరం ఆత్మహత్య చేసుకున్న ప్రియుడు 

వివాహేతర సబంధం మూడు నిండు ప్రాణాలను బలితీసుకున్న సంఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. వివాహితను ఆమె కొడుకును కత్తితో దారుణంగా పొడిచి హత్య చేసిన ఓ యువకుడు అనంతరం తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. 

ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. చిత్తూరు జిల్లాలోని మర్రిగుంట గ్రామంలో వనిత అనే మహిళ తన ఏడేళ్ల కొడుకు మహీధర్ తో కలిసి నివాసముంటోంది. ఆమె భర్త పురుషోత్తం మూడేళ్ల కింద మృతి చెందడంతో గ్రామంలో ఒంటరిగా జీవిస్తోంది. దీంతో ఆమెతో భరత్ అనే యువకుడు చనువుగా మెలుగుతూ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు.

అయితే వీరి మద్య గత కొద్ది రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఇలా గత శనివారం కూడా వనిత, భరత్ లు గొడవపడ్డారు. ఈ నేపథ్యంలో తెల్లవారుజామున భరత్‌ వనిత ఇంటికి చేరుకుని ఆమెతో పాటు కొడుకు మహిధర్‌పై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. దీంతో తల్లీకొడుకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత  భరత్‌ కూడా అక్కడే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు స:ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం స్థానిక  ఆస్పత్రికి తరలించారు. ఈ హత్యలు, ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

   

loader