ఓ స్టూడెంట్ గురుకుల పాఠశాల నుంచి కనిపించకుండా పోయాడు. దీంతో కుటుంబ సభ్యులు, సిబ్బంది, బంధువులు అంతా ఆ స్టూడెంట్ కోసం వెతికారు.కానీ కనిపించలేదు. అయితే నాలుగు రోజుల తరువాత ఆ స్కూల్ పక్కనే ఉన్న చెరువులో శవంగా తేలాడు. దీంతో తల్లిదండ్రులు, బంధువులు ఆ స్కూల్ ప్రాంగణంలో ఆందోళన చేపట్టారు.
కుమారుడు చదువుకొని తమను గొప్పగా చూసుకుంటారని ఆ తల్లిదండ్రులు కలలు కన్నారు. దీని కోసం తమ బిడ్డను గొప్పగా చదివించాలనుకున్నారు. అందులో భాగంగానే కుమారుడిని దగ్గరలో ఉన్న గురుకుల పాఠశాలలో జాయిన్ చేశారు. అంతా సవ్యంగా సాగిపోతోంది అని అనుకుంటున్న సమయంలో ఆ గురుకుల విద్యార్థి స్కూల్ నుంచి పారిపోయాడు. ఈ విషయంలో గురుకుల పాఠశాల సిబ్బందికి తెలిసింది. దీంతో చుట్టుపక్కల అంతా గాలించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. తమ అబ్బాయి ఎక్కడో క్షేమంగా ఉంటాడు. తిరిగి ఇంటికి వస్తాడు అని ఆ తల్లి దండ్రులు అనుకుంటున్న సమయంలో ఓ చెరువులో శవమై కనిపించాడనే వార్త ఒక్క సారిగా షాక్ కు గురి చేసింది. ఈ ఘటన వెస్ట్ గోదావరి జిల్లాలో శనివారం రాత్రి చోటు చేసుకుంది.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. west godvari జిల్లా koyyalgudem మండలం పొంగటూరుకు చెందిన కనుమూరి చరణ్ తేజ(charan tej)కు 15 ఏళ్లు. ఈ అబ్బాయి ఆరగొలనులోని bala yogi గురుకుల పాఠశాలలో 9th class చదువుతున్నాడు. అయితే ఏమయ్యిందో ఏమో గానీ ఈ నెల 14 తేదీన స్కూల్ నుంచి ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లాడు. పిల్లాడు స్కూల్ నుంచి కనపడకుండా పోయాడని స్కూల్ సిబ్బంది తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఆ తల్లిదండ్రులు, స్కూల్ సిబ్బంది, మరికొందరు కలిసి ఆ చరణ్ కోసం వెతికారు. కానీ ఎవరికీ కనిపించలేదు.
అయితే ఎక్కడో ఓ చోట తమ పిల్లాడు క్షేమంగా ఉంటాడు. తిరిగి ఇంటికి వస్తారని ఆ తల్లిదండ్రులు అనుకున్నారు. ఈ నెల 14 వ తేదీన స్కూల్ నుంచి పిల్లాడు కనిపించకుండా పోయిన నాటి నుంచి 5 రోజుల పాటు తల్లిండ్రులు ఎదురు చూశారు. అయితే 19వ తేదీన ఓ గ్రామ చెరువులో ఓ మృత దేహం కనిపించిందని అందరికీ సమాచారం అందింది. ఆ మృతదేహాన్ని చూసేందుకు అందరూ తరలివచ్చారు. అయితే ఆ మృతదేహాం కనిపించకుండా పోయిన చరణ్ తేజదే కావడం అక్కడున్న అందరినీ విస్మయానికి గురి చేసింది. కుమారుడి మృతదేహాన్ని ఆ తల్లిదండ్రులు షాక్ కు గురయ్యారు. తీవ్రంగా రోదించారు.
చరణ్ తేజ మృతి దేహం ఆ బాలుడు చదువుతున్న స్కూల్ సమీపంలోనే ఉంది. దీంతో ఆ గ్రామస్తులు, తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. వారంతా కలిసి స్కూల్ లో ఆందోళన నిర్వహించారు. టీచర్లపైకి రాళ్లు వేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతారవణం నెలకొంది. ఇది దాదాపు అర్ధరాత్రి వరకు కొనసాగింది. పోలీసులు అక్కడికి చేరుకొని చివరికి పరిస్థితిని అదుపులోకి తెచ్చింది. అయితే బాలుడి మృతికి కారణాలు ఏంటనేది ఇంకా పూర్తి స్థాయిలో తెలియరాలేదు. ఇదిలా ఉండగా.. కర్నూల్ జిల్లాల్లోని గోనెగండ్ల ప్రాంతంలో కూడా ఓ స్టూడెంట్ నీట మునిగి మృతి చెందాడు. గోనెగండ్ల (gonegandla) మండల పరిధిలోని ఐరన్ బండ (iron banda) కు చెందిన సోహెల్ (12) స్కూల్ కు వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో స్నేహితులతో కలిసి ఈత కొట్టాలనుకున్నాడు. అయితే కాలువలోకి దిగిన వెంటనే నీటి ప్రవాహం వల్ల ఓ గుంతలో పడిపోయాడు. దీంతో ఊపిరి ఆడక మృతి చెందాడు.
