తొమ్మిదేళ్ల బాలికను ఎత్తుకెళ్లి, స్మశానంలో అత్యాచారం..
ఆంధ్రప్రదేశ్ లో ఓ తొమ్మిదేళ్ల చిన్నారిపై 48యేళ్ల వ్యక్తి అత్యాచారం చేశాడు. బహిర్భూమికని బైటికి వచ్చిన చిన్నారిని ఎత్తుకెళ్లి స్మశానంలో అత్యాచారానికి పాల్పడ్డాడు.

పార్వతీపురం మన్యం జిల్లా : అభం శుభం తెలియని చిన్నారులపై లైంగిక అత్యాచారాలకు పాల్పడడం భయాందోళనలు కలిగిస్తున్న విషయం. పువ్వు లాంటి చిన్నారులను ముద్దు చేయాల్సింది పోయి.. కామంతో వంకర చూపులు చూస్తున్నారు కామంధులు. చిన్నారులని కూడా చూడకుండా వారిని కర్కశంగా నలిపేస్తున్నారు. అలాంటి ఓ ఘటన పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలంలోని ఓ గ్రామంలో జరిగింది. ఓ వివాహితుడు తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి డీఎస్పీ జివి కృష్ణారావు ఈ మేరకు వివరాలు తెలిపారు…
ఆదివారం రాత్రి 7 గంటలకు వీరఘట్టం మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక బహిర్భూమికి బయటకు వచ్చింది. అదే గ్రామానికి చెందిన గౌరునాయుడు (48) అనే వివాహితుడు... ఆ బాలిక కోసం దగ్గర్లో మాటు వేశాడు. చిన్నారి బయటికి రాగానే బలవంతంగా పట్టుకుని.. అక్కడినుంచి దూరంగా పలరుగులు తీశాడు. చిన్నారి అరవకుండా గట్టిగా నోరు మూశాడు.
క్షణికావేశంలో తల్లి ఆత్మహత్య.. ‘నేను రాను.. మీరు బాగా చదువుకోండి’ అని చెప్పి.. తండ్రి బలవన్మరణం..!!
ఆ తరువాత చిన్నారిని పక్కనున్న స్వహానంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఆ సమయంలో అటువైపు స్థానికులు రావడంతో అలికిడి అయ్యింది. అది విని నిందితుడు అక్కడినుంచి పరారయ్యాడు. స్థానికులు వెళ్లి చూడగా చిన్నారి మీద అత్యాచారం జరిగింది. దీంతో నిందితుడి కోసం స్థానికులు గాలించారు. అతను పక్క గ్రామంలో ఉన్నట్లు తెలుసుకుని పట్టుకున్నాడు. దేహశుద్ధి చేశారు.
బాలికను కుటుంబసభ్యులకు అప్పజెప్పారు. అయితే, అత్యాచారం వల్ల బాలికకు తీవ్ర రక్తస్రావం అయ్యింది. దీంతో ిన్నారిని పాలకొండ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. నిందితుడి గౌరు నాయుడు మీద పోక్సో కేసు నమోదు చేశారు. ఎస్సై హరికృష్ణ ఈ వివరాలను తెలిపారు.