గుంటూరు: కృష్ణమ్మకు పూజలు నిర్వహించడానికని చెప్పి కనకదుర్గమ్మ వారదిపైకి తమ్ముడి కొడుకుతో కలిసి వెళ్లిన ఓ వ్యక్తి అందరూ చూస్తుండగానే నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద సంఘటన విజయవాడలో చోటుచేసుకుంది. మృతుడు గుంటూరు జిల్లాకు చెందిన దుర్గాప్రసాద్ అని తెలిసింది.

కృష్ణా నదిపై పూజలు చేసుకొంటానని ఇంట్లో చెప్పిన దుర్గాప్రసాద్ తన సోదరుడి కొడుకు సుజిత్ ను కూడ వెంట తీసుకొని కనకదుర్గ వారధి పైకి వెళ్లాడు. ఈ క్రమంలో తన వెంట తెచ్చుకున్న పూలను వారధిపైనుండి నీటిలోకి విసురుతూ మొబైల్ లో సుజిత్ ను వీడియో తీయమన్నాడు. ఇలా కొద్దిదూరం నుండి సుజిత్ వీడియో తీస్తుండా ఒక్కసారిగా అతడు ఉదృతంగా ప్రవహిస్తున్న నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. 

వీడియో

"

 ఒక్కసారిగా చోటుచేసుకున్న ఈ పరిణామంతో అవాక్కయిని సుజిత్ వెంటనే కుటుంబసభ్యులకు సమాచారం అందించాడు. అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యుల సమాచారం మేరకు పోలీసులు కూడా ఘటనా స్ధలానికి చేరుకుని మృతదేహం కోసం గాలింపు చేపట్టారు. 

అంతకు ముందు దుర్గాప్రసాద్ తన సూసైడ్ నోట్ లో అనారోగ్యంతో చనిపోతున్నట్లు పేర్కొన్నాడు. ఓవైపు గల్లంతైన వృద్దుని కోసం అధికారుల గాలింపు చర్యలు చేపడుతూనే మరోవైపు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.  ఆత్మహత్య చేసుకునేంత అనారోగ్య సమస్యలు దుర్గాప్రసాద్ కు ఏమిటనే విషయమై  పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.