విజయవాడ: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న తరుణంలో ఆ పార్టీ ఎమ్మెల్యే కీలక నిర్ణయం తీసుకున్నారు. వైయస్ జగన్ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో ఆయనపై హెలికాప్టర్ తో పూలవర్షం కురిపించాలని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ నిర్ణయించుకున్నారు. 

వైయస్ జగన్ 20 నిమిషాల పాటు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ 20 నిమిషాలపాటు హెలికాప్టర్ తో పూలవర్షం కురిపించనున్నారు. 12.09 గంటల నుంచి 12.23 గంటల వరకు వైయస్ జగన్ పై హెలికాప్టర్ తో పూలవర్షం కురిపించనున్నారు. 

అయితే మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ నిర్ణయంపై పోలీస్ శాఖ అనుమతి ఇస్తుందా లేదా అన్నది సస్పెన్షన్ గా మారింది. వైయస్ జగన్ సీఎం కావాలన్నది తమ కోరిక అని పదేళ్లపాటు ప్రజల మధ్యనే ఉంటూ వారి కోసం అహర్నిశలు శ్రమించి నేడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారని ఈ నేపథ్యంలో తమకు అత్యంత సంతోషకరమని అందువల్లే పూలవర్షం కురిపించాలని నిర్ణయించుకున్నట్లు వసంతకృష్ణప్రసాద్ తెలిపారు.