ఏపీలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 8,943 మందికి కోవిడ్ సోకినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీటితో కలిపి రాష్ట్రంలో కేసుల సంఖ్య 2,73,085కి చేరింది.

కొత్తగా 97 మంది ప్రాణాలు కోల్పోవడంతో... మొత్తం మృతుల సంఖ్య 2,475కి చేరుకుంది. ఏపీలో గత 24 గంటల్లో కొత్తగా 53,026 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీటితో కలిపి మొత్తం టెస్టుల సంఖ్య 27,58,485కి చేరింది.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం 89,907 యాక్టివ్ కేసులున్నాయి. డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య లక్షా 80 వేల 703కు చేరింది. 24 గంటల్లో 9,779 మంది కోలుకున్నారు.

వైరస్ కారణంగా కర్నూలు జిల్లాలో 12, చిత్తూరు 10, తూర్పు గోదావరి 10, గుంటూరు 10, పశ్చిమ గోదావరి 10, నెల్లూరు 10, అనంతపురం 6, కడప 6, ప్రకాశం 6, శ్రీకాకుళం 6, విశాఖ 6, విజయనగరం 3, కృష్ణా జిల్లాలో  ఇద్దరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.

అత్యథికంగా తూర్పు గోదావరి జిల్లాలో 1,146 మందికి పాజిటివ్‌గా తేలింది. ఆ తర్వాత అనంతపురం 762, చిత్తూరు 987, గుంటూరు 527, కడప 530, కృష్ణా 338, కర్నూలు 956, నెల్లూరు 669, ప్రకాశం 300, శ్రీకాకుళం 547, విశాఖపట్నం 885, విజయనగరం 548, పశ్చిమ గోదావరిలలో 748 చొప్పున కేసులు నమోదయ్యాయి.