అనంతపురం జిల్లాలో (anantapur district) ఘోర రోడ్డు ప్రమాదం (road accident) జరిగింది. ఈ ఘటనలో ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు. మృతులను ఉరవకొండ మండలం నిమ్మగల్లు వాసులుగా గుర్తించారు.
అనంతపురం జిల్లాలో (anantapur district) ఘోర రోడ్డు ప్రమాదం (road accident) జరిగింది. ఆదివారం సాయంత్రం ఉరవకొండ మండలం (uravakonda) బుదగవిలో లారీ, కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు. కర్ణాటకలోని బళ్లారిలో (bellary) పెళ్లికి హాజరై తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మృతులను ఉరవకొండ మండలం నిమ్మగల్లు వాసులుగా గుర్తించారు. మృతులంతా కుటుంబ సభ్యులు, బంధువులుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
