ఏపీలో కరోనా ఉద్థృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 7,895 కేసులు  నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 3,53,111కు చేరుకుంది.

నిన్న ఒక్కరోజే వైరస్ కారణంగా 93 మంది ప్రాణాలు కోల్పోయారు... దీంతో మొత్తం మరణాల సంఖ్య 3,282కి చేరింది. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 7,449 మంది కోలుకోవడంతో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 2,60,087కి చేరుకుంది.

ప్రస్తుతం ఏపీలో 89,742 యాక్టివ్ కేసులు వున్నాయి. గత 24 గంటల్లో 46,712 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో మొత్తం టెస్టుల సంఖ్య 32,38,038కి చేరింది. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1,256 కేసులు నమోదయ్యాయి.

ఆ తర్వాత అనంతపురం 466, చిత్తూరు 934, గుంటూరు 507, కడప 448, కృష్ణా 142, కర్నూలు 685, నెల్లూరు 985, ప్రకాశం 923, శ్రీకాకుళం 227, విశాఖపట్నం 451, విజయనగరం 200, పశ్చిమ గోదావరిలలో 671 కేసులు వెలుగు చూశాయి.

ఇకపోతే నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 16 మంది మరణించారు. పశ్చిమ గోదావరి 13, చిత్తూరు 11, కర్నూలు 10, ప్రకాశం 9, కడప 8, శ్రీకాకుళం 6, విశాఖపట్నం 5, తూర్పు గోదావరి 4, అనంతపురం 3, గుంటూరు 3, కృష్ణ 3, విజయనగరంలలో ఇద్దరు చొప్పున మరణించారు.