అనంతపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అన్నకు వరుస అయిన ఓ బాలుడు ఏడేళ్ల చిన్నారి స్నానం చేస్తుండగా అశ్లీల వీడియోలు తీస్తూ ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా కూడేరు మండలంలోని కమ్మూరు గ్రామంలో చోటు చేసుకుంది. 

ఆ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కమ్మూరు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మొదటి భార్యకు ముగ్గురు కుమారులున్నారు ఆమె మరణించడంతో మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు కూతురు, కుమారుడు పుట్టారు. 

ఇటీవల భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయి. దీంతో భార్య పిల్లలతో పాటు పుట్టింటికి వెళ్లింది. రేషన్ కార్డులో వేలిముద్రల కోసమని ఆమె ఏడేళ్ల కూతురిని కమ్మూరుకు తీసుకుని వచ్చారు. మూడు రోజుల క్రితం ఆ బాలిక స్నానం చేస్తుండగా వరసకు అన్న అయిన 14 ఏళ్ల బాలుడు సెల్ లో అశ్లీల వీడియోలు చూస్తూ అత్యాచారం చేశాడు.

రెండు రోజుల క్రితం పుట్టింటిలో ఉన్న తల్లి వద్దకు చిన్నారి వెళ్లింది. మూత్ర విసర్జన సమయంలో చిన్నారి నొప్పితో బాధపడడడం, రక్తం కారుతుండడంతో తల్లి ఏం జరిగిందని అడిగింది. అన్న అత్యాచారం చేశాడని చిన్నారి చెప్పింది. మంగళవారం చిన్నారిని అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు. చిన్నారి తల్ిల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.