ఏపీలో కోవిడ్ ఉద్ధృతి కొనసాగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 6,190 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 6,87,351కి చేరుకుంది.

నిన్న ఒక్కరోజే వైరస్ కారణంగా 35 మంది ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మరణాల సంఖ్య 5,780కి చేరింది. ప్రస్తుతం ఏపీలో 59,435 యాక్టివ్ కేసులుండగా..  గత 24 గంటల్లో 9,836 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.

దీంతో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 6,22,136కి చేరుకుంది. నిన్న ఒక్కరోజే 68,429 శాంపిల్స్‌ను పరీక్షించగా.. మొత్తం టెస్టుల సంఖ్య 57,34,752కి చేరుకుంది.

నిన్న ఒక్కరోజే అనంతపురం 276, చిత్తూరు 784, తూర్పుగోదావరి 991, గుంటూరు 410, కడప 299, కృష్ణ 398, కర్నూలు 144, నెల్లూరు 432, ప్రకాశం 569, శ్రీకాకుళం 377, విశాఖపట్నం 291, విజయనగరం 312, పశ్చిమ గోదావరిలలో 907 కేసులు నమోదయ్యాయి.

అలాగే ప్రకాశం 8, చిత్తూరు 6, అనంతపురం 4, తూర్పుగోదావరి 4, గుంటూరు 4, విశాఖపట్నం 3, నెల్లూరు 2, పశ్చిమ గోదావరి 2, శ్రీకాకుళంలలో ఇద్దరు చొప్పున మరణించారు.