ఏపీలో భారీగా డిప్యూటీ కలెక్టర్ల బదిలీ.. ఒకేసారి 60 మందిని ట్రాన్స్‌ఫర్ చేస్తూ ఉత్తర్వులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకేసారి దాదాపు 60 మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది . గత నెలలోనూ రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి 35 మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేసిన సంగతి తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో భారీ సంఖ్యలో డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేసింది. దాదాపు 60 మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇకపోతే.. గత నెలలోనూ రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి 35 మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో 60 మందిని కూడా ట్రాన్స్‌ఫర్ చేయడంతో ప్రభుత్వ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.