విశాఖపట్నం అచ్యుతాపురం సెజ్‌లో మంగళవారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను అనకాపల్లి ఆసుపత్రికి తరలించారు. అభిజిత్ ఫెర్రో అల్లాయ్స్ కంపెనీలో గ్యాస్ ట్యాంక్ పేలినట్లుగా తెలుస్తోంది.

విశాఖపట్నం అచ్యుతాపురం సెజ్‌లో మంగళవారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను అనకాపల్లి ఆసుపత్రికి తరలించారు. అభిజిత్ ఫెర్రో అల్లాయ్స్ కంపెనీలో గ్యాస్ ట్యాంక్ పేలినట్లుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. ప్రమాదానికి దారి తీసిన కారణాలు తెలియాల్సి వుంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred