ఆందోళనకరం... ఒకే జిల్లాలో... 77 మంది టీచర్లు, విద్యార్థులకు కరోనా

ఏపీలో స్కూళ్లకు వెళ్తున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు కరోనా బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. 

59 teachers, 18 students tested corona positive

అమరావతి: నవంబర్ 2వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలలు పునఃప్రారంభమయిన విషయం తెలిసిందే. అయితే అప్పటి నుండి స్కూళ్లకు వెళ్తున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు కరోనా బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఒక్క అనంతపురం జిల్లాలోనే 59 టీచర్లు, 18మంది విద్యార్థులకు కరోనా బారిన పడినట్లు సమాచారం. 

జిల్లావ్యాప్తంగా 14424 టీచర్లకు కోవిడ్ పరీక్షలు నిర్వహించగా 59 మందికి పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. అలాగే 1212 మంది విద్యార్థినీ విద్యార్థులకు కోవిడ్ పరీక్షలు చేయగా 18 మంది కరోనా బారిన పడినట్లు విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. ఇలా స్కూల్ లో కరోనా విజృంభించడం ఆందోళన కలిగిస్తోంది. 

మొత్తంగా చూసుకుంటే  ఆంధ్ర ప్రదేశ్ లో గత 24గంటల్లో 2,745 కరోనా కేసులు నమోదయినట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తం 85,364మందికి పరీక్షలు నిర్వహించగా తాజా కేసులు బయటపడినట్లు వెల్లడించారు.  తాజా కేసులతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 835953కు చేరగా టెస్టుల సంఖ్య 84,27,629కు చేరింది. 

ఇక మరణాల విషయానికి వస్తే తాజాగా 13మంది మృతిచెందారు. చిత్తూరు ఇద్దరు, కృష్ణా ముగ్గురు, విశాఖ ఇద్దరు, అనంతపూర్ ఒకరు, తూర్పు గోదావరి ఒకరు, గుంటూరు ఒకరు, ప్రకాశం ఒకరు, శ్రీకాకుళం ఒకరు, పశ్చిమ గోదావరి ఒకరు మృతిచెందారు. రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 6,757 కు చేరింది. 

రికవరీ విషయానికి వస్తే గత 24గంటల్లో 2,292మంది కరోనా నుండి కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 804423కు చేరింది. దీంతో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య  21878కు చేరింది.  

జిల్లాలవారిగా కేసులను పరిశీలిస్తే తూర్పు గోదావరి 407, పశ్చిమ గోదావరి 428, కృష్ణా 398 కేసులు బయటపడ్డాయి. ఇక చిత్తూరు 286, అనంతపూర్ 218, గుంటూరు 207, కడన 125, కర్నూల్ 38, నెల్లూరు 130, ప్రకాశం 124, శ్రీకాకుళం 91, విశాఖపట్నం 120, విజయనగరం 83 కేసులు నమోదయ్యాయి.  

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios