అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. తాజాగా గత 24 గంటల్లో 56 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 1833కు చేరుకుంది. గత 24 గంటల్లో 8,087 మంది నమూనాలను పరీక్షించగా 56 మందికి కరోనా సోకినట్లు తేలింది. 

మరో ఇద్దరు మరణించారు. కర్నూలు, కృష్ణా జిల్లాల్లో ఒక్కరేసి కరోనా వైరస్ బారిన పడి మరణించారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 38కి చేరుకుంది. ఇప్పటి వరకు 780 మంది చికిత్స పొంది కోలుకోగా, 1015 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 

తాజాగా అనంతపురం జిల్లాలో మూడు, గుంటూరు జిల్లాలో పది, కడప జిల్లాలో 6 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలో 16, కర్నూలు జిల్లాలో 7 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నెల్లూరులో 4, విశాఖపట్నం జిల్లాలో 7, విజయనగరం జిల్లాలో 3 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి.

గత 24 గంటల్లో చిత్తూరు, తూర్పు గోదావరి, ప్రకాశం, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఏ విధమైన కేసులు నమోదు కాలేదు. కర్నూలు జిల్లా 540 పాజిటివ్ కేసులతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా 373 కేసులతో గుంటూరు జిల్లా రెండో స్థానంలో, 316 కేసులతో కృష్ణా మూడో స్థానంలో కొనసాగుతున్నాయి.

జిల్లాలవారీగా కోవిడ్ -19 పాజిటివ్ కేసుల సంఖ్య ఇలా ఉంది...

అనంతపురం 83
చిత్తూరు 82
తూర్పు గోదావరి 46
గుంటూరు 373
కడప 96
కృష్ణా 316
కర్నూలు 540
నెల్లూరు 96
ప్రకాశం 61
శ్రీకాకుళం 5
విశాఖపట్నం 46
విజయనగరం 3
పశ్చిమ గోదావరి 59