ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు పడిపోతూనే వున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్త 54 మందికి కోవిడ్ నిర్థారణ అయినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

వీటితో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా బారినపడి వారి సంఖ్య 8,89,210కి చేరుకుంది. నిన్న కోవిడ్ వల్ల రాష్ట్రంలో ఏ ఒక్కరూ మరణించలేదు. ఇప్పటి వరకు ఏపీలో కరోనాసోకి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 7,167కి చేరుకుంది.

ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 604 మంది చికిత్స పొందుతున్నారు. గడిచిన 24 గంటల్లో 70 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. వీరితో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 8,81,439కి చేరుకుంది.

నిన్న రాష్ట్రంలో 26,436 మందికి కోవిడ్ నిర్థారణా పరీక్షలు చేశారు. వీటితో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో నిర్వహించిన కరోనా టెస్టుల సంఖ్య 1,36,97,048కి చేరుకుంది.

గడిచిన 24 గంటల్లో అనంతపురం 3, చిత్తూరు 19, తూర్పుగోదావరి 6, గుంటూరు 5, కడప 2, కృష్ణ 5, కర్నూలు 6, నెల్లూరు 3, ప్రకాశం 1, శ్రీకాకుళం 0, విశాఖపట్నం 3, విజయనగరం 0, పశ్చిమ గోదావరి లలో ఒక కేసు చొప్పున నమోదయ్యాయి.