రోడ్డు ప్రమాదంలో ఐదేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాదకర సంఘటన ఆలమూరు లో చోటుచేసుకుంది. ఆలమూరు మండలం చొప్పెల్ల జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో పశ్చిమ బెంగాల్ కు చెందిన ఆసియా(5)మృతి చెందింది. 

పశ్చిమ బెంగాల్ కి చెందిన కొన్ని కుటుంబాలు పని కోసం వలస వస్తున్నారు.  వీరు గురువారం రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ లో దిగి ఇటుక బట్టీ పనులకు ఆటోలపై పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ప్రాతానికి వెళుతున్నారు. పది ఆటోల్లో వీరు వెళుతూ చొప్పెల్ల హైస్కూల్ వద్ద టిఫిన్ చేయడానికి ఆగారు.

ఇంతలో ఈ పాప రోడ్డుపై రావడంతో వేమగిరి నుండి రావులపాలెం వైపుకు వెళుతున్న లారీ ఢీ కొట్టంది.పాప ఆసియా అక్కడికక్కడే మృతి చెందింది. లారీ ఆగకుండా వెళ్లి పోతుంటే చొప్పెల్ల లాకుల సమీపంలో వెంబడించి స్థానికులు అడ్డుకున్నారు.పాప కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు.