తూర్పుగోదావరి (east godavari district) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కల్తీ జీలుగ కల్లు (illicit kallu) తాగి ఐదుగురు గిరిజనులు ప్రాణాలు కోల్పోయారు. రాజవొమ్మంగి మండలం లోదొడ్డి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
తూర్పుగోదావరి (east godavari district) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కల్తీ జీలుగ కల్లు (illicit kallu) తాగి ఐదుగురు గిరిజనులు ప్రాణాలు కోల్పోయారు. రాజవొమ్మంగి మండలం లోదొడ్డి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానిక అధికారులు ఘటనాస్థలికి చేరుకుని కల్లు శాంపిల్స్ సేకరించారు. ఒకేసారి ఐదుగురు గ్రామస్తులు మరణించడంతో గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
