గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. తిరుపతి నుంచి పాలకొల్లు వెళ్తున్న కారు జాతీయ రహదారిపై చిలకలూరిపేట పట్టణంలోని ఎన్ఆర్‌టీ సెంటర్‌లో రోడ్డు పక్కన నిలిచి ఉన్న లారీని బలంగా ఢీకొట్టింది.

ప్రమాద సమయంలో కారులో 11 మంది ఉన్నారు. వీరిలో ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలవ్వగా.. మిగిలిన ఆరుగురిని ఆసుపత్రికి తరలించారు. మరణించిన వారిని పాలకొల్లుకు చెందిన వెంకటేశ్వరరావు, సూర్యభవానీ, సోనాక్షీ, గీతేశ్వర్, ఆనందకుమార్‌గా గుర్తించారు.  వీరిలో ఇద్దరు చిన్నారులే.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.