బాపట్ల జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెెందిన ఐదుగురు మత్యువాతపడ్డారు. దీంతో శివరాత్రి పండగపూట ఆనందంగా వుండాల్సిన ఆ కుటుంబంలో విషాదం నిండింది,
బాపట్ల : శివరాత్రి పండగపూట బాపట్ల జిల్లాలో ఘోరం జరిగింది. శనివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం అద్దంకి ఎస్సై కుటుంబంలో విషాదాన్ని నింపింది. హైవేపై వేగంగా వెళుతున్న కారు అదుపుతప్పి యాక్సిడెంట్ కు గురవగా కారులోని ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు.
అద్దంకి ఎస్సై సమందరవలి కుటుంబసభ్యులు ఒంగోలు నుండి గుంటూరు వైపు కారులో బయలుదేరారు. అయితే వీరు బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం మేదరిమెట్ల బౌపాస్ వద్దకు రాగానే ఒక్కసారికి కారు పంక్చర్ అయ్యింది. మంచి స్పీడ్ లో వుండగా టైర్ పంక్చర్ కావడంతో అదుపుతప్పిన కారు డివైడర్ ను ఢీకొట్టి రోడ్డుకు అవతలి వైపు దూసుకెళ్లింది. ఇదే సమయంలో గుంటూరు నుండి ఒంగోలు వైపు వెళుతున్న లారీ ఈ కారును ఢీకొట్టింది.
Reda More శివరాత్రి వేళ పట్టిసీమ వద్ద విషాదం.. గోదావరి నదిలో ముగ్గురు గల్లంతు..
ఇలా కారు డివైడర్, లారీని ఢీకొనడంతో నుజ్జునుజ్జయి అందులోని ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. వీరిలో నలుగురు మహిళలు, ఓ పురుషుడు వున్నారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా తెలుస్తోంది. శివరాత్రి పండగ పూట జరిగిన ఈ ప్రమాదం ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది.
కారు ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే అద్దంకి సీఐ రోశయ్య సిబ్బందితో కలిసి ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతుల వివరాలు తెలుసుకున్న ఆయన కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. అనంతరం మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఏరియా హాస్పిటల్ కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
