విజయనగరం (vizianagaram) జిల్లాలో భారీ చోరీ (robbery) జరిగింది. గంట స్తంభం సమీపంలోని రవి జ్యూయెలర్స్‌లో బంగారం దోచుకుపోయారు దొంగలు. దాదాపు 5 కేజీల బంగారం, వెండి, నగదు అపహరించుకుపోయారు.
విజయనగరం (vizianagaram) జిల్లాలో భారీ చోరీ (robbery) జరిగింది. గంట స్తంభం సమీపంలోని రవి జ్యూయెలర్స్‌లో బంగారం దోచుకుపోయారు దొంగలు. దాదాపు 5 కేజీల బంగారం, వెండి, నగదు అపహరించుకుపోయారు. దీనిపై షాపు యాజమాని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, క్లూస్ టీమ్ ఆధారాల కోసం పరిశీలించారు. అయితే దీనిని అంతర్రాష్ట్ర దొంగల ముఠా పనిగానే పోలీసులు అనుమానిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
