శుభకార్యానికి వెళ్లివస్తుండగా రోడ్డు ప్రమాదం, ఐదుగురి మృతి

5 Died In Road Accident at Anantapur District
Highlights

శుభకార్యానికి వెళ్లి తిరిగివస్తుండగా ప్రమాదానికి గురై ఐదుగురు యువకులు మృత్యువాత పడ్డారు. వారు ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వచ్చిన లారీ వేగంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.  అనంతపురం జిల్లాలో ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది.  

శుభకార్యానికి వెళ్లి తిరిగివస్తుండగా ప్రమాదానికి గురై ఐదుగురు యువకులు మృత్యువాత పడ్డారు. వారు ప్రయాణిస్తున్న కారు ను ఎదురుగా వచ్చిన లారీ వేగంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.  అనంతపురం జిల్లాలో ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది.  

ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. బెంగుళూరులోని బయ్యప్పనహళ్లికి చెందిన మురళీ(20), మంజునాథ్‌(24), దినేష్‌(24), రామ్మోహన్‌ (22), శివప్రసాద్‌(25) లు పావగడలో  ఓ శుభకార్యానికి హాజరయ్యారు. ఉదయం కారులో కలిసి వచ్చిన వీరు తిరిగి అదే కారులో సాయంత్రం బెంగళూరుకు బయలుదేరారు. అయితే తిరుగు ప్రయాణంలో వీరు ప్రయాణిస్తున్న కారు మధుగిరి సమీపంలోని కెరెగల పాళ్య వద్ద ఓ లోడ్ లారీని ఢీకొట్టింది. 

చాలా వేగంతో ఎదురెదురుగా వచ్చి  ఒకదానినొకటి ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జయ్యింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రమాద స్థలంలోనే మృతి చెందారు. 

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నారు.
 

loader