విశాఖలో విషాదం చోటు చేసుకుంది. యారాడ బీచ్‌కు విహారయాత్ర కోసం వచ్చిన నలుగురు యువకులు గల్లంతయ్యారు. దీనిని గమనించిన కొందరు గజ ఈతగాళ్లు వెంటనే సముద్రంలోకి దూకి ముగ్గురిని కాపాడారు. మరో వ్యక్తి ఆచూకీ దొరకలేదు.

గల్లంతైన వ్యక్తిని గొంతేసిపాలెంకి చెందిన వారిగా తెలుస్తోంది. యారాడ బీచ్ సాధారణంగానే చాలా ప్రమాదకరంగా ఉంటుంది. దీనికి తోడు వర్షా కాలం కావడంతో లోతు మరింత పెరిగింది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు  తెలియాల్సి వుంది.