విశాఖపట్నంలో విషాదం చోటు చేసుకుంది. విష పదార్థం తాగి నలుగురు మరణించారు.  స్వతంత్ర నగర్‌లో ఓ సీసాలో నిల్వ వుంచిన ద్రవపదార్థాన్ని మద్యంగా భావించిన కొందరు అస్వస్థతకు గురయ్యారు.

ఆ కొద్దిసేపటికే వీరిలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వీరంతా పందులను పెంచేవారు. సమాచారం అందుకున్న పోలీసులు అస్వస్థతకు గురైన వారిని ఆసుపత్రికి తరలించారు. చనిపోయిన వారిలో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.