అన్నమయ్య జిల్లా పెద్దతిప్పసముద్రం మండలం కానుగమాకులపల్లెలో గృహ ప్రవేశ వేడుకలో ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్‌తో నలుగురు ప్రాణాలు కోల్పోయారు 

అన్నమయ్య జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పెద్దతిప్పసముద్రం మండలం కానుగమాకులపల్లెలో గృహ ప్రవేశ వేడుకలో ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్‌తో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ఆసుపత్రికి తరలించగా.. పరిస్ధితి విషమంగా వున్నట్లుగా తెలుస్తోంది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.