ఆంధ్రప్రదేశ్‌లో భారీగా డిప్యూటీ కలెక్టర్లు బదిలీ అయ్యారు. ఒకేసారి 35 మందిని ఏపీ ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో భారీగా డిప్యూటీ కలెక్టర్లు బదిలీ అయ్యారు. ఒకేసారి 35 మందిని ఏపీ ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 14 జిల్లాల డీఆర్వోలను బదిలీ చేసింది. శ్రీకాకుళం జిల్లా డీఆర్వోగా ఎం. గణపతి రావు, విజయనగరం జిల్లా డీఆర్వోగా డి అనిత, విశాఖపట్నం జిల్లా డీఆర్వోగా కె మోహన్ కుమార్, ఏలూరు జిల్లా డీఆర్వోగా ఎం వెంకటేశ్వర్లు, పశ్చిమ గోదావరి జిల్లా డీఆర్వోగా జింకా ఉదయ్ భాస్కర్, ఎన్ఠీఆర్ జిల్లా డీఆర్వోగా ఎం శ్రీనివాస్, కృష్ణా జిల్లా డీఆర్వోగా పి వెంకట రమణ, నెల్లూరు జిల్లా డీఆర్వోగా లక్ష్మీ శివజ్యోతి, అనంతపురం డీఆర్వోగా ఎన్ రాజశేఖర్, తిరుపతి జిల్లా డీఆర్వోగా పెంచల కిషోర్, చిత్తూరు జిల్లా డీఆర్వోగా టి పద్మావతి, అనకాపల్లి జిల్లా డీఆర్వోగా బి దయానిధి, కర్నూలు జిల్లా డీఆర్వోగా కె మధుసూదన్ రావు, బాపట్ల జిల్లా డీఆర్వోగా ఏవీఎస్ఎన్ మూర్తిలను నియమించారు.
సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఈవోగా ఎస్ శ్రీనివాసమూర్తిని, శ్రీశైలం భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి వార్ల దేవస్థానం ఈవోగా డి పెద్ది రాజును నియమించింది.
ఇక, ఆంధ్రప్రదేశ్‌లో 11 మంది ఐపీఎస్ అధికారులను కూడా బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖపట్నం సీపీగా ఎ రవిశంకర్, విశాఖ శాంతి భద్రతల డీసీపీగా కె శ్రీనివాసరావు, వైఎస్సార్ జిల్లా ఎస్పీగా సిద్ధార్థ్ కౌశల్, అనంతపురం ఎస్పీగా అన్బురాజన్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఐజీగా త్రివిక్రమ వర్మ, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అదనపు డీజీగా కుమార్ విశ్వజిత్, గ్రేహౌండ్స్ ఎస్పీగా వి విద్యాసాగర్ నాయుడు, అన్నమయ్య జిల్లా ఎస్పీగా బొడ్డేపల్లి కృష్ణారావు, 14వ బెటాలియన్ కమాండెంట్‌గా ఆర్ గంగాధరరావు, ఏసీబీ ఎస్పీగా అద్నాన్ నయీం అస్మి, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీగా పి జగదీశ్‌లను నియమించింది
