కర్నూలు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వైసీపీ కార్యకర్తలు దుర్మరణం పాలయ్యారు. దేవనకొండ మండలం కరిడికొండ వద్ద బైక్‌ను తప్పించబోయి కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు.

ఎమ్మెల్యే శ్రీదేవి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ఇద్దరిని వెల్దుర్తికి చెందిన రాము, దేవేంద్రగా గుర్తించారు.

ఈ ఘటనలో ఏడుగురికి తీవ్రగాయాలవ్వడంతో పోలీసులు వారిని ఆసుపత్రికి తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా వున్నట్లు  తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.