అభం, శుభం తెలియని మూడేళ్ల చిన్నారితో ఓ వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించిన జుగుస్సాకరమైన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా, తణుకులో జరిగింది. ఈ ఘటనలో స్థానికులు ఆ కామాంధుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. వివరాల్లోకి వెడితే...

తణుకులోని పాతూరు ఎనిమిదో వార్డులో ఉంటున్న చిన్నారి వీధిలో పిల్లలతో ఆడుకుంటుంది. జంగారెడ్డి గూడేనికి చెందిన అడపా వీరబ్రహ్మం మంగళవారం పాతూరులోని బంధువుల ఇంటికి వచ్చాడు. బాగా మద్యం సేవించిన జంగారెడ్డి చిన్నారితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. 

ఇది గమనించిన స్థానికులు అతడిని పట్టుకుని తాళ్లతో కట్టేశారు. అనంతరం దేహశుద్ధి చేశారు. కొట్టుకుంటూ నగ్నంగా మున్సిపల్‌ కార్యాలయం వరకు ఊరేగించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. చిన్నారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.