విజయవాడలోని రాయవేలూరు క్యాబ్ డ్రైవర్ ధనశేఖర్ కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది.


విజయవాడ: విజయవాడలోని రాయవేలూరు క్యాబ్ డ్రైవర్ ధనశేఖర్ కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది.

గత నెల 27వ తేదీన క్యాబ్ డ్రైవర్ ధనశేఖర్ భార్య జయంతి తన ఇద్దరు కూతుళ్లతో పాటు వరుసకు తండ్రయ్యే గోపాలకృష్ణతో కలిసి వేలంగిని మాత ఆలయానికి వెళ్లారు. వేలంగి మాత ఆలయంలోని గెస్ట్‌హౌజ్‌లో బస చేశారు. అయితే జయంతి పెద్ద కూతురు మహాలక్ష్మి గెస్ట్‌హౌజ్‌లో అనుమానాస్పద స్థితిలో మరునాడు మరణించింది.

మహాలక్ష్మి మృతికి గోపాలకృష్ణ కారణమని ధనశేఖర్ తో పాటు ఆయన కుటుంబసభ్యులు ఆరోపించారు.దీంతో ఈ నిందను భరించలేక జయంతి తన చిన్నకూతురు శ్రీలక్ష్మి, గోపాలకృష్ణన్‌లు రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు.

తమిళనాడు రాష్ట్రంలోని రాయవేలూరుకు చెందిన ధనశేఖర్ భార్య జయంతి, గోపాలకృష్ణన్, శ్రీలక్ష్మి విజయవాడకు వచ్చి సూసైడ్ కు పాల్పడ్డారు.