శ్రీకాకుళం జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పలాస మండలం నెమలి నారాయణ పురం వద్ద జాతీయ రహదారిపై ఆగివున్న లారీని బోలెరో వాహనం ఢీకొట్టింది. 

శ్రీకాకుళం జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పలాస మండలం నెమలి నారాయణ పురం వద్ద జాతీయ రహదారిపై ఆగివున్న లారీని బోలెరో వాహనం ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా.. మరో 9 మందికి తీవ్రగాయాలయ్యాయి. జార్ఖండ్ నుంచి వలస కూలీలు విశాఖ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని అంబులెన్స్‌లో క్షతగాత్రులను పలాస ఆసుపత్రికి తరలించారు.

అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరు యువకులు మరణించారు. తీవ్రగాయాల పాలైన ఓ యువకుడిని మెరుగైన చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ ఆ యువకుడు మరణించాడు.

గాయపడిన తొమ్మిది మంది పలాస ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసుకున్న కాశీబుగ్గ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

"

"