విశాఖ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ టూరిస్ట్ బస్సు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన కొంతమంది.. ఒడిశాలోని రాయ్‌గఢ్‌లోని మజ్జిగౌరమ్మ అమ్మవారి దర్శనానికి వెళ్లారు.

వీరంతా తిరిగి కాకినాడ వస్తుండగా.. విశాఖ జిల్లా పాడేరు మండలం వంట్ల మామిడి ఘాట్‌రోడ్‌లో వీరు ప్రయాణిస్తున్న బస్సు అదుపుతప్పి బోల్తాకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. తీవ్రగాయాలైన మరో నలుగురిని విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. కాగా.. ప్రమాద సమయంలో  వర్షం పడటంతో సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడింది.