వినాయక మండపం ముందు డ్యాన్స్ చేస్తూ.. కుప్పకూలిన యువకుడు.. మరోక్షణంలో..
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో విషాదం జరిగింది. డ్యాన్స్ చేస్తూ ఓ యువకుడు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ విషాద ఘటన ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో చోటు చేసుకుంది
ఇటీవల హార్ట్ ఎటాక్ వయస్సుతో నిమిత్తం లేకుండా వచ్చేస్తోంది. ఐదేళ్ల పిల్లవాడి నుంచి అరవై ఏళ్ల ముసలి వాళ్ల వరకు గుండె పోరు కలవరపెడుతోంది. హఠాత్తుగా ఎందరి గుండెలు ఎప్పుడూ ఆగిపోతుందో చెప్పడం కష్టంగా మారింది. అప్పటివరకు హుషారుగా ఉన్న వారు మరుక్షణాల్లో విగత జీవులుగా మారుతున్నారు. జిమ్‌లో ఎక్సర్సైజ్ చేస్తూ..క్రికెట్ ఆడుతూ.. డ్యాన్స్ చేస్తూ.. ఇంకా రోడ్డు మీద నడుస్తూ హఠాత్తుగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోతున్నారు.
తాజాగా అలాంటి ఘటననే వెలుగులోకి వచ్చింది. ఓ యువకుడు వినాయక చవితి సంబరాల్లో డ్యాన్స్ చేస్తూ హఠాత్తుగా కుప్పకూలి పోయాడు. నిండా ముప్పై ఏళ్లు కూడా లేని ఆ యువకుడు అందరూ చూస్తుండగానే ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకెళ్తే.. ధర్మవరం పట్టణంలోని మారుతి నగర్ లో ఏర్పాటుచేసిన వినాయకుని మండపం ముందు ప్రసాద్ (26) అనే యువకుడు తన స్నేహితుడితో కలిసి డ్యాన్స్ చేస్తున్నాడు. చుట్టు పక్కల ఉన్న వారు అతడ్ని ఎంకరేజ్ చేస్తున్నారు. అప్పటి వరకు ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేసిన ప్రసాద్ ఒక్కసారిగా కుప్ప కూలిపోయాడు. అసలేం జరిగిందో కూడా అర్థం కాలేదు.
వెంటనే అతని స్నేహితులు ప్రసాద్ ను సమీపంలోని హాస్పిటల్ కు తరలించారు. అయితే అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్దారించారు. డ్యాన్స్ చేస్తున్న సమయంలో గుండెపోటు వచ్చిందని వైద్యులు తెలిపారు. అప్పటి వరకు ఎంతో హుషారుగా డ్యాన్స్ చేస్తూ అందర్ని అలారించిన ప్రసాద్ ఉన్నట్టు ఉండి ప్రాణాలు కోల్పోడం స్నేహితులు, స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ యువకుడి మరణంతో స్థానికంగా విషాద చాయలు అలముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.