ఏలూరులో వరుసగా పిల్లలు అస్వస్థతకు గురవ్వడం కలకలం రేపుతోంది. నగరంలోని పడమర వీధిలోని పెద్ద అమ్మవారి గుడి ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

విషయం తెలుసుకున్న వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఇంటింటి సర్వే చేస్తున్నారు. అనారోగ్యం బారినపడ్డ పిల్లల్ని ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

ఇప్పటి వరకు 20 నుంచి 25 మంది పిల్లలు అస్వస్థతకు గురైనట్లు అధికారులు అధికారులు తెలిపారు. గాలి, నీరు, ఆహారం ఏమైనా కలుషితం అయ్యిందా కోణంలో వైద్య సిబ్బంది ఆరా తీస్తున్నారు. విషయం తెలుసుకున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు.