దెందులూరు: పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం కొత్తగూడెం శివారులో కొమరేపల్లి గ్రామంలో అంతుచిక్కని కారణాలతో 24 మంది అస్వస్థతకు గురయ్యారు.

గురువారం నాడు రాత్రి నుండి పలువురు మూర్చ, కళ్లు తిరిగి పడిపోతున్నారు.  ఈ విషయాన్ని తెలుసుకొన్న స్థానిక ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, కలెక్టర్ ముత్యాల రాజు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గ్రామంలో  గ్రామంలో పర్యటించి బాధితులను పరామర్శించారు.

బాధితులను ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గతంలో కూడ ఏలూరులో కూడ ఇదే తరహాలో వింత వ్యాధితో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఏలూరు తర్వాత జిల్లాలోని భీమడోలు మండలంలో కూడ ఇదే తరహాలో  ప్రజలు వ్యాధి బారిన పడ్డారు. తాజాగా దెందులూరులో వింత వ్యాధికి గురయ్యారు.

గ్రామంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టర్.  గ్రామంలో ప్రతి ఇంటికి తిరిగి పరీక్షలు నిర్వహిస్తున్నారు. వింత వ్యాధి జిల్లాను వీడడం లేదు. ఇదే జిల్లాలో ఎందుకు ఈ రకంగా ప్రజలు  వింత వ్యాధి బారిన పడుతున్నారనే విషయమై అధికారులు ఆరా తీస్తున్నారు.